మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 15, 2020 , 13:53:56

సురక్షిత ప్రయాణం కోసం ఇండియన్ రైల్వే “ పోస్ట్ కోవిడ్ బోగీ’’

సురక్షిత ప్రయాణం కోసం ఇండియన్ రైల్వే “ పోస్ట్ కోవిడ్ బోగీ’’

ఢిల్లీ:  కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ  ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. “ పోస్ట్ కోవిడ్ బోగీ’’ పేరుతో  మెరుగైన సదుపాయాలతో  రైలుబోగీని రూపొందించింది రైల్వేశాఖ. చేతులతో తాకాల్సిన అవసరంలేకుండా సరికొత్త సదుపాయాలు, రాగిపూత పూసిన హ్యాండ్ రెయిలింగ్స్, తలుపుల గడియలు, ఏసీ బోగీల్లో గాలి శుద్ధీకరణ వ్యవస్థ, టిటేనియం డై ఆక్సైడ్ పూత తదితర ఏర్పాట్లు చేశారు. రైలు ప్రయాణాల్లో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు భారతీయ రైల్వేశాఖ పలు చర్యలు తీసుకున్నది.  కపూర్తలా లోని రైలు బోగీల తయారీ కర్మాగారం ఈ విభిన్నమైన బోగీని రూపొంచింది.  


logo