శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 14, 2020 , 22:31:14

విపణిలోకి "హ్యుందాయ్ టక్సన్"

 విపణిలోకి

ముంబై :హ్యుందాయ్ ఇండియా విపణిలోకి నూతన కారును ప్రవేశపెట్టింది. న్యూ టక్సన్ ఫేస్ లిఫ్ట్ ను భారత మార్కెట్లో కి విడుదల చేసింది. ఈ కొత్త (2020) హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 22.3 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఇండియా). న్యూ హ్యుందాయ్ టక్సన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జిఎల్ (ఓ), జిఎల్ఎస్ ,జిఎల్ఎస్ 4 డబ్ల్యుడి అనే మూడు వేరియంట్లు. ఈ మూడు వేరియంట్లలో టాప్-స్పెక్ ట్రిమ్, డీజిల్ యూనిట్‌తో మాత్రమే అందించనున్నారు. మిగిలిన రెండు (జిఎల్ (ఓ) , జిఎల్‌ఎస్) పెట్రోల్ , డీజిల్ ఇంజన్ ఆప్షన్ల తో వస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శించారు.

కొత్త హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే మరిన్ని ఫీచర్ల తో అందిస్తున్నారు. హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ లో మాడిఫైడ్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, పెద్ద క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ ఫ్రంట్ ,రియర్ బంపర్స్, కొత్తగా రూపొందించిన 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఎల్‌ఇడి టైల్లైట్స్ కూడా ఉంటాయి. కొత్త హ్యుందాయ్ టక్సన్ కొంచెం సవరించిన నంబర్ ప్లేట్ హౌసింగ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ముందు భాగంలో సిల్వర్ ఫినిషెడ్ స్కఫ్ ప్లేట్లు , వెనుక ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ కలిగి ఉంది.

ఇక పొతే ఇందులో ఉన్న 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 180 బిహెచ్‌పి , 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జాయింట్ చేశారు. టక్సన్ ఫేస్ లిఫ్ట్ లో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పూర్తిగా పునఃరూపకల్పన చేసిన డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో , బ్రాండ్ లేటెస్ట్ వెర్షన్ బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీతో వస్తుంది. “హ్యుందాయ్ వర్చువల్ ప్రపంచాన్ని డిజిటల్ అనుభవంలో పరిచయం చేసినందుకు మేము సంతోషిస్తున్నాము - 'ది నెక్స్ట్ డైమెన్షన్ '. సాంకేతిక తతో, హ్యుందాయ్ కొత్త అనుభవాన్ని లైవ్లీ గా తీసుకువచ్చే న్యూ మోడల్ ను సృష్టించింది. ‘ది నెక్స్ట్ డైమెన్షన్’ అనేది హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ ద్వారా విభిన్న సంస్కృతులు లీనమయ్యే వ్యక్తీకరణ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎండి ,సిఇఒ ఎస్ఎస్ కిమ్  తెలిపారు


logo