శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 18:33:49

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

ముంబై : బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి.  దేశీయ , అంతర్జాతీయ మార్కెట్లోనుకిందకు దిగివచ్చింది. ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.5 శాతం తగ్గి రూ.48,912 పలుకగా ... అంతకుముందు సెషన్‌లో ఏకంగా 0.55 శాతం పెరిగింది. వెండి కూడా 1.2 శాతం తగ్గి కిలో రూ.52,408 పలికింది. అంతకుముందు సెషన్‌లో 3.3 శాతం తగ్గింది. కరోనా, గ్లోబల్ టెన్షన్స్ వంటి వివిధ కారణాలతో బంగారం ధరలు గత వారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు రూ.49,348 గరిష్టానికి చేరుకుంది. ఎంసీఎక్స్‌లో తగ్గినప్పటికీ బయట బులియన్ మార్కెట్లో పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.120 వరకు పెరిగి 10 గ్రాములు రూ.49,960 పలికింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగి రూ.51,240 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.46,960కి చేరుకుంది. కిలో వెండి రూ.52,210కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఔన్స్ 0.2 శాతం పడిపోయి 1,798.52 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి 1,802.20 డాలర్లు వద్ద నిలిచింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ స్వల్పంగా పెరిగి 833.14 డాలర్ల వద్ద ఉంది.

వెండి ధర 0.1 శాతం తగ్గి 19.07 డాలర్లుగా ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం 0.1 శాతం పెరిగింది. మిగతా కరెన్సీలతో డాలర్ బలపడితే ఆయా కరెన్సీలలో బంగారం ధర పెరుగుతుంది. అంతర్జాతీయ గోల్డ్ ట్రస్ట్ ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 0.3 శాతం పెరిగి 1,203.97 టన్నులకు చేరుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనత, పెరుగుతున్న కరోనా కేసులు బంగారంపై ఒత్తిడిని పెంచుతాయని, సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి వైపు చూస్తారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


  


logo