ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 15:19:36

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

హైదరాబాద్: ఇండియా క్రికెటర్ అంబటి రాయుడికి తండ్రిగా ప్రమోషన్ లభించింది. ఆయన భార్య విద్య తాజాగా పండంటి ఆడబిడ్డకు  జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఐపీఎల్ 2018 సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అంబటి రాయుడు మ్యాచ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. 2009లో చెన్నుపల్లి విద్యను రాయుడు ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. క్రికెట్ కెరీర్ పరంగా గత ఏడాది నుంచి అంబటి రాయుడు క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో 602 పరుగులు సాధించిన అంబటి రాయుడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. కానీ.. ఏడాది వ్యవధిలోనే భారత సెలక్టర్ల తీరు కారణంగా అతను రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంతో మనస్థాపానికి గురైన రాయుడు ఆ టోర్నీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ.. రోజుల వ్యవధిలోనే ఆ రిటైర్మెంట్ నిర్ణయాన్ని రాయుడు వెనక్కి తీసుకున్నాడు. రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని హైదరాబాద్ తరఫున రంజీల్లో ఆడాడు.  


logo