గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 20:32:09

సిగరెట్ల తో శివుడికి పూజలు... ఎక్కడో తెలుసా?

  సిగరెట్ల తో శివుడికి పూజలు... ఎక్కడో తెలుసా?

సోలన్: శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు వెలిగించి అగరుబత్తులు వెలిగించ డంలో  వింతేమీలేదు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వాటికి భిన్నంగా సిగరెట్లతో శివుడికి అభిషేకం చేస్తారు. అక్కడ సిగరెట్లతో అత్యంత ఘనంగా పూజలు నిర్వహి స్తుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో ఈ   వింత ఆచా రాన్ని ఎన్నో ఏండ్లుగా కొనసాగిస్తున్నారు. సోలన్ జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇతర ఆలయాల్లోలాగా అగరుబత్తులను వెలిగించారు. భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఇక్కడ భక్తుల విశ్వాసం మరోటి ఉంది. సిగరెట్లను గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతున్నాయనిభక్తులు నమ్ముతుంటారు.


logo