శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 11, 2020 , 19:04:04

నకిలీ ఎస్బీ ఐ బ్రాంచ్ పేరుతో మోసం

నకిలీ ఎస్బీ ఐ బ్రాంచ్ పేరుతో మోసం

చెన్నై: జనాలను నమ్మించేందుకు పన్నాగం పన్నారు కొందరు క్రిమినల్స్.  ఎక్కడో ఉన్న బ్యాంకు ను దోచుకోవడం కన్నా.... మనమే ఓ బ్యాంకు ఏర్పాటు చేసి మరింతగా డబ్బు దండుకోవచ్చనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆ కేటుగాళ్లు నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కడలూరు జిల్లా పన్ రూటీ లో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ ను ఏర్పాటు చేసి లావాదేవీలు జరుపుతున్నారు. అయితే ఈ కేటుగాళ్ల పై అనుమానం వచ్చిన బ్యాంకు ఖాతాదారుడు తాను అకౌంట్ కలిగి ఉన్న బ్రాంచ్ మేనేజర్ కు ఆ విషయం పై చర్చించడంతో, సదరు ఎస్బిఐ మేనేజర్ ఉన్నత అధికారులతో చర్చించారు.

అయితే ఆ ప్రాంతంలో కేవలం రెండు బ్రాంచ్ లకే అనుమతి ఉండగా ఈ బ్రాంచ్ గురించి తమకు తెలియదని చెప్పడంతో అధికారులు నకిలీ ఎస్బిఐ బ్రాంచ్ పై దాడులు నిర్వహించారు. దీంతో ఒరిజినల్ ఎస్బిఐ అధికారులఅవాక్కయ్యారు. అచ్చం ఎస్బిఐ బ్యాంకు లో ఉన్న ఫర్నిచర్ తో సహా అచ్చుగుద్దినట్టు అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించారు. అయితే ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురిని ఎస్బిఐ అధికారులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ముగ్గురు   నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 


logo