శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 23:31:29

కియా మోటార్స్ అరుదైన ఘనత

 కియా మోటార్స్ అరుదైన ఘనత

న్యూ ఢిల్లీ: కియా మోటార్స్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కియా మోటార్స్ ఇండియా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. పదకొండు నెలల్లో 50,000 కార్ల మైలురాయిని చేరుకున్న ఏకైక కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇందులో బోల్డ్ , డైనమిక్ కియా సెల్టోస్‌తో పాటు ప్రీమియం , కియా కార్నివాల్ ఉన్నాయి. కియా మోటార్స్ ఇండియా దేశంలో మొట్టమొదటి ఉత్పత్తి ప్రారంభించిన కేవలం 10 నెలల్లోనే ఈ ఘనత దక్కించుకున్నది. “మా కస్టమర్లకు ఇన్నోవేషన్ , నెక్స్ట్-జెన్ టెక్నాలజీని తీసుకురావడానికి మా బలమైన సంకల్పం , నిరంతర కృషి తో  మేము ఈ మైలురాయిని సాధించామని " కియా మోటార్స్ ఇండియా ఎండిఅండ్ సీఈవో కూఖిన్ షిమ్ తెలిపారు.  కియా వినూత్న UVO కనెక్ట్ టెక్నాలజీ భారతదేశంలో యజమానులు తమ కార్లతో నిమగ్నమయ్యే విధానంలో గణనీయమైన మార్పును తెచ్చింది. ఇప్పుడు కొత్త సెల్టోస్ , రాబోయే సోనెట్‌లో నవీకరించిన UVO కనెక్ట్ తో, కియా డ్రైవింగ్‌ను మరింత ఆహ్లాదకరంగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా చేసిందని ఆయన అన్నారు.logo