మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 16:09:19

ఓయో సంస్థ సంచలన నిర్ణయం

  ఓయో సంస్థ సంచలన నిర్ణయం

ఢిల్లీ : కరోనా నేపథ్యంలో అన్ని కంపెనీలు నష్టాల బాట పట్టాయి. అయితే పలు సంస్థలు నష్టాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తగ్గిస్తుండగా, మరికొన్ని కంపెనీలు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రముఖ ఆన్లైన్ హోటల్స్ గదుల బుకింగ్ సంస్థ ఓయో వినూత్న నిర్ణ యం తీసుకున్నది. ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్నది. ఈ సమయంలో అన్ని రంగాలకంటే అధికంగా ఆతిథ్య రంగం, టూరిజం, ట్రావెల్ రంగాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ రంగంలోనే సేవలు అందిస్తున్న ఓయో కూడా అంతకంటే అధికంగా నష్టాలలో కూరుకుపోయింది. దీంతో చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అయితే, ఇక్కడే సంస్థ కొంచెం కొత్తగా ఆలోచించింది. ఇకపై ఉద్యోగులకు ఈ విషయంలో ఏదో రకంగా ప్రయోజనం చేకూర్చాలని, వారు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఓయో తమ సొంత కంపెనీ అనే భావన కలిగేలా సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ దెబ్బకు విధించిన లాక్ డౌన్ తో ఓయో కొంత మంది ఉద్యోగులను తొలగించగా... ఉన్న వారికి కూడా 25శాతం వేతనాల్లో కోత విధించారు. మరికొందరిని ఆగష్టు వరకు పరిమితమైన ప్రయోజనాలతో ఇంటికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఓయో సీఈఓ రోహిత్ కపూర్ ఇదే విషయాన్ని వెల్లడించారు. అయితే, తాజాగా కంపెనీ సరికొత్త విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఇకపై ఓయో ఉద్యోగులు అందరూ ఓయో సహ - యజమానులు (కో- ఓనర్) గా మారనున్నారు. ఆ మేరకు వారికి చాలా తక్కువ ధరలో కంపెనీ ఈసోప్స్ కేటాయించనున్నారు. కంపెనీ తమ ఉద్యోగులకు ఇచ్చిన రాత పూర్వక పత్రాలను కూడా అందించిందట. 


logo