గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 21:35:13

మొలకెత్తిన పెసలు... ఆరోగ్యానికి ఎంతో మేలు...

మొలకెత్తిన పెసలు...  ఆరోగ్యానికి ఎంతో మేలు...

హైదరాబాద్:  మొలకెత్తిన పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వీటిని నిత్యం తీసుకుంటుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. పోషకాలు నిండుగా ఉండే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మొలకల్లా చేసి తింటే మరీ మంచిది. శరీరభాగాలను సంరక్షించడంలో పెసలు అద్భుతంగా పనిచేస్తాయి. కాపర్ కూడా అధికంగా ఉండే పెసలను తినడం ద్వారా చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. మొలకెత్తిన గింజల్లో సమృద్ధిగా అమైనో ఆమ్లాలు ఉంటాయి. శరీరంలో వ్యాప్తి చెందే క్యాన్సర్ కణాలను ఇవి నిరోధిస్తాయి.పెసలు పప్పుని ప్రతి రోజు రాత్రి పూట పడుకునే ముందు ఒక్క కప్పులో 50 గ్రాముల మేర నానబెట్టేయాలి. ఉదయాన్నే వాటిలో మొలకలు వచ్చి ఉంటాయి. మాములు పెసలులో కంటే ఇలా మొలకలు వచ్చిన పెసలులో చాలా పోషకాలు ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


logo