సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 04, 2020 , 00:17:54

బల్లిని ఇంటి నుంచి తరిమేయాలంటే ?

బల్లిని ఇంటి నుంచి తరిమేయాలంటే ?

హైదరాబాద్: కొంత మందికి బల్లిని చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. బల్లి అంటే మనిషికి అంత అసహ్యం. బల్లి ఇంట్లో ఉండాలని ఎవరు కొరుకోరు. ఇంట్లో కి బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.బల్లులకు సిట్రస్ జాతి పురుగులు అంటే పడదు. ఇవి సిట్రస్ ఫలాల్ని కాని, ఆకులని కాని, గ్రాస్ ని కాని అసహ్యించుకుంటాయి. కాబట్టి లెమన్ గ్రాస్ ని కాల్చి ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేయండి. ఆ వాసన వాటికి పడదు. లేదంటే లెమన్ గ్రాస్ ని ఆయిల్ లో ముంచి ఎక్కడైతే బల్లులు దర్శనమిస్తున్నాయో అక్కడ కొన్ని చుక్కలు పోయండి. కర్పూరం మన ఇంట్లో కామన్ గానే ఉంటుంది.

ఈ కర్పూరం వాసన మనుషులకి ఇష్టం కాని బల్లులకి ఇష్టం లేదు. అవి వాటికి ఎలర్జీని కలిగించనట్టు ఫీల్ అవుతాయట. కర్పూరానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయట. మరి ఇంకేం కర్పూరం బిల్లలు తీసుకోని బల్లులు వచ్చే చోటు దగ్గరే కాదు ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. దెబ్బకి బల్లి పారిపోతుంది.బల్లి వేడిగా ఉన్న ప్రదేశంలో ఉండేందుకు ఇష్టపడుతుంది. అది వాతావరణంలో సడెన్ గా మార్పు జరిగితే తట్టుకోలేదు. కాబట్టి మీ ఇంట్లో వాతావరణం లేదా టెంపరేచర్ మారేలా చేయండి. ఏసి అన్ చేయండి ఆ చలి భరించడం వాటి వల్ల కాదు. లేదంటే ఓ స్ప్రే బాటిల్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసి అవి కరుగుతుండగానే నీటిని బల్లులపై స్ప్రే చేస్తే అవి పారి పోతాయి. 


logo