శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 23:46:04

కొత్తగా రెండు సంస్థలను ప్రారంభించిన పేటీఎం

 కొత్తగా రెండు సంస్థలను ప్రారంభించిన పేటీఎం

బెంగళూరు : పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ దూసుకుపోతున్నారు. తన వ్యక్తిగత పెట్టుబడుల కోసం కొత్తగా రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటంతో సహా ఇతరత్రా అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. వీఎస్ఎస్ ఇన్వెస్ట్ కో, వీఎస్ఎస్ హోల్డింగ్స్ అనే పేర్ల తో విజయ్ శేఖర్ శర్మ రెండు కొత్త పెట్టుబడి సంస్థలను ఏర్పాటు చేశారు. ఇందులో అయన భార్య మృదుల భాగస్వామిగా ఉన్నారు. ఈ రెండు సంస్థల్లో కూడా విజయ్ శేఖర్ శర్మ అయన భార్య మాత్రమే వాటాదారులుగా ఉన్నారు. ఈ సంస్థల ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తరహా కార్యకలాపాలు కొనసాగుతాయి. దీంతో పెట్టుబడులు పెట్టటం, షేర్లు, డిబెంచర్లు, సెక్యూరిటీ లను కొనుగోలు చేయటం, స్టాక్స్, బాండ్స్ ల కొనుగోలు వంటి కార్యకలాపాలు ఉంటాయి. అలాగే వాటి విక్రయం సహా అనుబంధ కార్యకలాపాలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

 


logo