మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 23:17:31

ఆఫీస్ స్పేస్ కు తగ్గుతున్న డిమాండ్

ఆఫీస్ స్పేస్ కు తగ్గుతున్న డిమాండ్

ఢిల్లీ : ఒకప్పుడు కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే యమా క్రేజ్ ఉండేది. ఇప్పుడు కరోనా కారణంగా ఆ పరిస్థితి మారిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం జోరు మీద ఉండటంతో పాటు దేశంలో స్టార్టుప్ కల్చర్ పెరుగుతున్న కొద్దీ ఆఫీస్ స్థలాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్  హోమ్ ఆప్షన్ ఇచ్చేశాయి. దీనిని పెర్మనెంట్ కూడా చేసే అవకాశం ఉన్నది. దీంతో ఆఫీస్ స్థలాలకు కూడా డిమాండ్ పడిపోతున్నది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు డిఫెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు సరుకులు అధికంగా ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ కామర్స్ రంగం బూమ్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి, వేర్ హౌస్ లు, లాజిస్టిక్స్ రంగంలో అవకాశాలు అధికంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు ఆర్ధిక నిపుణులు.  


logo