మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 19:44:17

కరోనా ఎఫెక్ట్ : రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గనున్న పెట్టుబడులు

 కరోనా ఎఫెక్ట్ : రియల్ ఎస్టేట్ రంగంలో తగ్గనున్న పెట్టుబడులు

బెంగళూరు : ఇతర రంగాల కంటే రియల్ ఎస్టేట్ రంగం లోనే అత్యధికంగా పెరుగుదల కనిపిస్తుంటుంది. కోవిడ్-19 దెబ్బ అన్ని రంగాలతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికీ తగిలింది.ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగంలోకి వచ్చే సంస్థాగత పెట్టుబడులు భారీగా తగ్గిపోనున్నాయి. దేశంలో సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన కారణంగా ఆర్థిక వ్యవస్థపై పెనుభారం పడింది. ఉద్యోగుల సంఖ్య, జీతాల్లో కోత వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు అత్యవసరాలు మినహా మిగితా కొనుగోళ్లు నిలిపివేశారు. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి గుదిబండగా మారింది. సాధారణంగా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు ఉండటానికి ఇల్లు, కొంత స్థలం ఉండాలనే కోరిక బలంగా ఉంటాయి. అందుకే మిగితా రంగాలు ఎలా ఉన్నా... రియల్ ఎస్టేట్ లో లావాదేవీలు కొనసాగుతుంటాయి. కానీ... ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. logo