బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 02, 2020 , 19:11:34

9,638 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

9,638 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్

ఢిల్లీ : గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్ల నియామకాలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 9638 ఖాళీలతో నోటిఫికేషన్‌ ను ప్రకటించింది.  దేశవాప్తంగా 43 గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లను  నియమించనున్నది. తెలుగు రాష్ట్రాల్లో అయిదు ఆర్ ఆర్ బీల్లో 836 పోస్టులు ఉన్నాయి. వీటీలో ఏపీకి సంబంధించి 366, తెలంగాణకు సంబంధించి 470 ఉన్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 21, 2020.   వివరాలకు https://ibps.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.

అర్హతలు: ఆఫీస్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ కనీస అర్హత. ఏ ప్రాంతానికి దరఖాస్తు చేసుకుంటున్నారో అక్కడి స్థానిక భాష పై పట్టుండాలి. ఆఫీసర్ స్కేల్ - 1: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ. అగ్రికల్చర్, హార్టీ కల్చర్, ఫారెస్ట్రీ తదితర విభాగాల్లో డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం. స్థానిక భాష తెలిసి ఉండాలి. స్కేల్‌- 1 ఆఫీసర్‌(అసిస్టెంట్‌మేనేజర్‌)గా చేరిన అభ్యర్థి మేనేజర్‌, సీనియర్‌మేనేజర్‌, చీఫ్‌మేనేజర్‌/రీజనల్‌మేనేజర్‌, జనరల్‌మేనేజర్‌స్థాయి వరకు ఆపై ఛైర్మన్‌/మేనేజింగ్‌డైరెక్టర్‌స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్‌గా జాయిన్‌అయిన అభ్యర్థులు చీఫ్‌మేనేజర్‌, జనరల్‌మేనేజర్‌స్థాయిల వరకు చేరుకోవచ్చు. స్కేల్ -2, 3 ఆఫీసర్ ఉద్యోగాకు డిగ్రీతో పాటు కొన్ని అదనపు అర్హతలు, అనుభవం అవసరం.

తాజావార్తలు


logo