మంగళవారం 14 జూలై 2020
National - Jul 01, 2020 , 01:26:02

కేక్స్ విభాగంలోకి ప్రవేశించిన మాండెలెజ్

 కేక్స్ విభాగంలోకి ప్రవేశించిన మాండెలెజ్

ఢిల్లీ : క్యాడ్ బరీ డెయిరీ మిల్క్, క్యాడ్ బరీ బోర్న్ విటా, ఓరియో వంటి భారతీయ అభిమాన స్నాకింగ్ బ్రాండ్లలో కొన్నిటి తయారీదారు అయిన మాండలెజ్ ఇండియా  క్యాడ్ బరీ చాకొబేక్స్ చాక్ లేయర్డ్ కేక్స్ ను విపణిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఆవిష్కరణతో కంపెనీ తమ అంతర్జాతీయ బేకింగ్ నైపుణ్యాన్నిఅభిమానించే చాకొలెటీ క్యాడ్ బరీ రుచిని మరొక రూపంలోనూ అందించనున్నది. క్యాడ్ బరీ చా కొబేక్స్ చాక్ లేయర్డ్ కేక్స్ 2020 జూలై నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. ‘‘చా కొలెట్ రుచిని బార్ కు మాత్రమే పరిమితం చేయకుండా, అంతకు మించి ముందుకుతీసుకెళ్తూ, సంబంధిత విభాగాల్లోకి కూడా మా పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్నాం. నేడు బిస్కెట్స్ , కుకీస్ లో మా పటిష్ఠ క్యాడ్ బరీ వారసత్వం,మా  సామర్థ్యం లేయర్డ్ కేక్స్ తో బేకరీ , కేక్స్ విభా గంలోకి ప్రవేశించేలా చేశాయని" మాండలెజ్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ అయ్యర్ అని అన్నారు.


logo