శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 01:11:22

తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన విధివిధానాలు

తొలి ఏకాదశి రోజున పాటించాల్సిన విధివిధానాలు

హైదరాబాద్: సంసృతీ, సంప్రదాయాల ద్వారా మన పూర్వీకులు మానిషికి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పురాణాల్లో చక్కగా వివరించారు. అంతేకాకుండా...ఎటువంటి పండగలకు ఏమేమి చేయాలో కూడా నిర్ధేశించారు. ప్రధమైకాదశి అను సంస్కృతి నామాన్ని బట్టి తెలుగు వారు దీనిని తొలి ఏకాదశి గా వ్యవహరి స్తున్నారు. సంవత్సరానికి 24 ఏకాదశులు... అందులోనూ  అధికమాసంలో ఇరవై ఆరు ఏకాదశు లు వచ్చినా ప్రధమైకాదశి, మహా ఏకాదశి అని ఈ ఒక్క ఏకాదశిని గొప్పగా చెప్పడానికి కారణాలు వున్నాయి. సంవత్సరానికి అయనములు రెండు. అందునా దక్షిణాయన పుణ్యకాలం యందు పం డుగలు అధికంగా వస్తాయి. అంతేకాక ఆరోగ్యం కోసం నియమాలు ఎక్కువగా పాటించాల్సిన అవస రం రీత్యా పెద్దవారు అనేక వ్రతాలు పెట్టారు.

అటువంటి పండుగలను ప్రారంభం ఈ ఏకాదశి నుంచే.ఇంకో విధంగా చూస్తే చాతుర్మాస్యదీక్ష దినాల ఏకాదశుల్లో మొదటిది కావడం వలన కూడా దీనికి ప్రధమైకాదశి అని పేరు వచ్చింది. అసలు ఈ తొలి ఏకాదశి పండుగ గురించి బ్రహ్మవైవర్త పురాణం లో వివరంగా ఉన్నది.   ఏకాదశి చాలా విశిష్టమైనది. విష్ణుమూర్తికి ప్రియమైనది. ఈ రోజు హరిశయ నోత్సవం జరుపుతారు. ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి.

తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పండితులు అంటున్నారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు క్షీరసముద్రంలో శేషశాయియై పండుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడని పురాణాలలో చెపుతారు. అం టే వ్రతము తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చేస్తారు. ఇంకొక పౌరాణిక గాథలో విష్ణుమూర్తి ఈ రోజు నుంచి కూడా పాతాళలోకంలో బలిచక్రవర్తి ద్వారం వద్ద ఉండి కార్తీక శుద్ధ ఏకాదశికి తిరిగి వస్తాడని అంటారు. అయితే క్షీర సముద్రంలో విష్ణుమూర్తి శయనించుట వల్ల హరిశయనైకాదశి అనే పేరు కూడా ఉన్నది. అలాగే శయనైకాదశి అని కూడా పిలుస్తారు.  


logo