సోమవారం 13 జూలై 2020
National - Jun 30, 2020 , 20:56:38

గురక సమస్యకు గుడ్ బాయ్ చెప్పండిలా...

గురక సమస్యకు గుడ్ బాయ్ చెప్పండిలా...

 హైదరాబాద్ : గురక ఇతరులకు చిరాకు తెప్పించడమే కాదు.  భయాందోళనలకు గురిచేస్తుంటాయి. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాల్లో మొగుడి గురక తట్టుకోలేక విడాకులకై కోర్టులకు వెళ్లిన వాళ్ళూ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచ జనాభాలో కనీసం 40 శాతం మంది గురకపెట్టే వారున్నారు. పెద్దల్లోనే కాదు... పిల్లల్లో సైతం ఈ సమస్య  కనిపిస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ గురక ఎక్కువవుతుంది. అలాగే బరువు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య కూడా పెరుగుతుంది. గురక పెట్టేవాళ్ళు రాత్రి సరిగ్గా నిద్రపోక పగలు కునికి పాట్లు పడుతూ వాహనాలు నడిపేటప్పుడు యాక్సిడెంట్లు చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది.

గురక వల్ల నిద్రాభంగం, వేకువజామున తీవ్రంగా తలనొప్పిగా ఉండటం. పగటి నిద్ర, ఏ పని చేసినా పని మీద ఏకాగ్రత లేకపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు, రాత్రివేళల్లో ఎక్కువ మూత్రం, హై బిపి, హార్ట్‌ ఎటాక్, అంగస్తంభన సమస్యలు లక్షణాలు కనబడుతాయి. గురక సమస్యకు ఇంటి చిట్కాలతో చెక్ పెట్టేయవచ్చు. శ్వాస నాళాల్లో ఇబ్బందులు, బ్లాకేజ్ లను నివారించడంలో కార్డమమ్ గ్రేట్ గా సహాయపడుతుంది. శ్వాస నాళలంలో ఎలాంటి ఇబ్బందులేకుండా ఉంటే గురక సమస్యలు ఉండవు.

గురకను నివారించడంలో ఆలివ్ ఆయిల్ ఒకటి. ఇది ఇన్ఫ్లమేషన్ కు గురైన టిష్యలున్ , రెస్పిరేటరీ ప్యాసేజ్ కు ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు శ్వాసనాళల వాపు తగ్గిస్తుంది. నాజల్ ప్యాసేజ్ సలపడాన్ని తగ్గిస్తుంది. తేనె వాపులను తగ్గిస్తుంది. గొంతు నొప్పి నివారిస్తుంది . శ్వాస నాళంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చేస్తుంది. అందుకు తేనె లూబ్రికాంట్ గా సహాయపడుతుంది. గురక తగ్గిస్తుంది. గొంత నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

నాజల్ ప్యాసేజ్ బ్యాక్ అయినప్పుడు లేదా శ్వాసనాళం బ్లాక్ అయినప్పుడు స్టీమ్ ద్వారా ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా ముక్కు దిబ్బడను నివారిస్తుంది. సులభంగా బ్రీతింగ్ తీసుకోవడానికి సహాయపడుతుంది. నిద్ర బాగా పట్టేందుకు సహాయపడుతుంది. పసుపులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నాజల్ ప్యాసేజ్ ను క్లియర్ చేస్తుంది . ముక్కులో ఏలాంటి బ్లాక్స్ ఏర్పడకుండా పసుపు నివారిస్తుంది . పసుపును గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగడం వల్ల ప్రభావం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.


logo