గురువారం 02 జూలై 2020
National - Jun 28, 2020 , 23:58:41

పేపర్ తో రైలు ...

పేపర్ తో రైలు ...

తిరువంతపుర :  కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన 12 ఏండ్ల బాలుడు తన ప్రతిభను చూపించాడు. పాఠశాలకు వెళ్ళే వయసులోనే, పాత వార్తాపత్రికలతో ఏకంగా ఒక ట్రైన్ నమూనా తయారుచేసాడు. కేరళకు చెందిన అద్వైత కృష్ణ కు చిన్నప్పటి నుంచి రైలు అంటే ఎంతో ఇష్టం . లాక్ డౌన్ సమయంలో అతను తన సృజనాత్మకతను వెలికితీశాడు .  పాత వార్తాపత్రికల తో రైలు మోడల్ ను తయారు చేశాడు. దీనిని కేవలం మూడు రోజుల్లో తయారు చేశాడు . అద్వైత కృష్ణ తయారు చేసిన ఈ  మోడల్ రైలును ఏంటో అద్భుతంగా రూపొందించాడు . ఈ రైలు మోడల్ పాత రైలుపై ఆధారపడి ఉంటుంది. ఫ్రంట్ డీజిల్ ఇంజన్, పొగ గొట్టం, చిన్న క్యాబిన్, చక్రాలతో సహా అతను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు . బోగీలకు ఇరువైపులా తలుపులు , కిటికీలు తయారుచేశాడు. ఈ మోడల్‌ను రైల్వే శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది.  దీంతో  ఈ పేపర్ ట్రైన్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 


logo