గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 22:43:42

అమెజాన్ లో తాత్కాలిక ఉద్యోగాలు

అమెజాన్ లో తాత్కాలిక ఉద్యోగాలు

ఢిల్లీ :ప్రముఖ ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగాలపై ప్రకటన చేసింది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అవసరమైన సేవలు అందించనున్నది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరు నెలల పాటు కస్టమర్ల అవసరాలు తీర్చడంలో ఇబ్బందులు ఉండవని అమెజాన్ ఇండియా వెల్లడించింది. హైదరాబాద్, పుణే, కోయంబత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోతో సహా పది నగరాల్లో తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపింది. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ తదితర భాషలు వచ్చి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఇంటర్ మీడియట్ అర్హతగా నిర్ణయించింది అమెజాన్. 2025 నాటికి ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ అమ్మకాలు పెరిగాయి. దీంతో  కొత్తగా ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది అమెజాన్ . 


logo