మంగళవారం 07 జూలై 2020
National - Jun 27, 2020 , 01:00:51

బాలాజీ దేవాలయాన్ని అద్బుతంగా నిర్మించిన జెఎస్‌డబ్ల్యు

  బాలాజీ దేవాలయాన్ని అద్బుతంగా నిర్మించిన  జెఎస్‌డబ్ల్యు

కర్నూలు : భారతదేశంలో సుప్రసిద్ధ గ్రీన్ సిమెంట్ ఉత్పత్తిదారు , 14 బిలియన్ డాలర్ల జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌లో భాగమైన జెఎస్‌డబ్ల్యు సిమెంట్ సంస్థ  ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో నూతన బాలాజీ దేవాలయాన్ని నిర్మించింది. బిల్కలగూడూరు గ్రామంలో దేవాలయాన్ని బ్లాక్ లైమ్‌స్టోన్ ను వినియోగించి 2.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. బాలాజీ దేవాలయం నిర్మాణ శైలి మహోన్నతమైన భారతీయ దేవాలయ శిల్పకళతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. 10వ శతాబ్దం నుంచి ఉన్న తిరుపతిలోని బాలాజీ దేవాలయం నమూనాను పోలి ఉండేలా దీనిని తీర్చిదిద్దారు. నంద్యాలలోని నూతన బాలాజీ దేవాలయంలో బాలాజీ , వరహాస్వామి ప్రతిమలు బ్లాక్‌లైమ్‌స్టోన్ జిగ్గార్ట్స్‌లా ఉంటాయి.

బాలాజీ ఆలయ ప్రాజెక్ట్‌కు శ్రీమతి అనూశ్రీ జిందాల్ నేతృత్వం వహించారు. భారతీయ ఆర్కిటెక్ట్ , సమీప్ పదోరా అండ్ అసోసియేట్స్  సమీప్ పదోరా దీనికి ముఖ్య ఆర్కిటెక్ట్‌గా పనిచేశారు. జెఎస్‌డబ్ల్యు , సీఎస్ఆర్ నిధుల ద్వారా నిధులను జెఎస్‌డబ్ల్యు సమకూర్చడంతో పాటు,ఈ దేవాలయాన్ని నందాల్య ప్రజలకు అంకితం చేసింది."స్థానిక ప్రజలతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా వారికి మెరుగైన భవిష్యత్‌ను అందించడాన్ని జెఎస్‌డబ్ల్యు విశ్వసిస్తుంటుంది. నంద్యాల పట్టణ ప్రజలకు ధర్మబద్ధమైన, సురక్షితమైన ఆరాధనకు వీలుగా ఈ దేవాలయాన్ని నిర్మించే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడని భావిస్తున్నాను.  స్థానిక ప్రజలకు ప్రశాంతమైన సామాజిక సమావేశాలకు, మనశ్శాంతిని అందించే రీతిలో ఈ దేవాలయాన్ని రూపొందించామని" జెఎస్‌డబ్ల్యుకు చెందిన శ్రీమతి అనూశ్రీ జిందాల్  అన్నారు.


logo