ఆదివారం 05 జూలై 2020
National - Jun 27, 2020 , 00:21:03

కొత్త పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఎస్ సీ

కొత్త పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఎస్ సీ

హైదరాబాద్‌ : ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్(సీఏపీఎఫ్‌) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1564 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్ ఎస్ సీ) ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 1564 ఖాళీల్లో ఢిల్లీ పోలీ‌సలో 169 ఎస్‌ఐ, సీఏపీఎఫ్లో 1395 ఎస్‌ఐ(జీడీ) పోస్టులున్నాయి. సీఆర్‌పీఎఫ్‌, బీఎ‌స్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ తదితర ప్రత్యేక పోలీసు విభాగాలు సీఏపీఎఫ్‌ పరిధిలోకి వస్తాయి. ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై 2021 జనవరి 1 నాటికి 20 నుంచి 25 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 16. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించరు. అభ్యర్థులను స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ రెండు దశల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తుంది.  


logo