గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 23:58:56

మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?

మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?

హైదరాబాద్: సాధారణంగా మనిషికి అధికంగా చెమట పట్టిందంటే ఆరోగ్యంగా ఉన్నారని అంటారు. కానీ ప్రస్తుత సమాజంలో అధికంగా చెమట వచ్చినప్పటికి అనారోగ్యానికి కారణమని కొందరు అపోహలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ మనిషికి చెమట పట్టడం మంచిదా? కాదా?.  మనిషి ఆరోగ్యానికి చెమట ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో విపరీతమైన వేడితో చెమట సాధారణం కంటే అధికంగా వస్తుంది. వేసవిలో శ్వేధం అధికంగా స్రవించడం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ద్రవాలను కోల్పోతాం. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు విపరీతమైన వేడి, తేమ (గాలిలో ఆవిరి) వల్ల జుట్టు పొడిబారుతుంది. వ్యాయాయం పూర్తయిన తర్వాత కచ్చితంగా స్నానం చేయాలని.. ముఖ్యంగా మెడ ప్రాంతంపై చెమట ఎక్కువ వస్తుంది కాబట్టి నిత్యం శుభ్రం చేసుకోవాలని, శరీరాన్ని నిత్యం సున్నితంగా శుభ్రం చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తయిన జట్టును సొంతం చేసుకోవాలంటే నిత్యం నీటితో శుభ్రం చేసుకోవాలి. కానీ కొన్ని కాస్మోటిక్‌ కంపెనీలు చమట పట్టడాన్ని పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అయితే కంపెనీల ప్రకటనలను చర్మ వ్యాధి నిపుణులు కొట్టిపారేశారు. శరీరానికి కావాలసిన చెమట స్రవించడం వల్ల మనిషికి దాహం వేస్తుంది. దీంతో దాహం తీరడానికి ఎక్కువగా నీళ్లను తీసుకుంటారు. శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణకు  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం నుంచి చెమట స్రవించడం వల్ల శరీరానికి ఉపయోగపడే ఖనిజాలు విడుదలవుతాయని.. ఇవి పొడిబారిన చర్మాన్ని, యూరియా, యూరిక్‌ యాసిడ్‌, చెడు బ్యాక్టీరియా,అలర్జీ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడతాయి. 


logo