బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 00:38:24

ఆరోగ్య ప్రదాయిని పైనాపిల్

ఆరోగ్య ప్రదాయిని పైనాపిల్

హైదరాబాద్ : ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన పండ్ల ల్లో పైనాపిల్ ఒక‌టి. ఇందులో పొటాషియం, సోడియం నిల్వలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో తోడ్పడుతాయి.  పైనాపిల్‌లో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. పైనాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి.ఇలా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న పైనాపిల్ చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలోనూ ఉపకరిస్తుంది. పైనాపిల్ ను మెత్తగా పేస్ట్‌ చేసి అందులో ఎగ్ వైట్, కొద్దిగా పాలు మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుని అర గంట త‌ర్వాత‌ చల్లని నీటితో క్లీన్‌ చేసుకుంటే చర్మం నిగారి స్తుంది.  అంతేకాదు ముఖంపై ఉన్న మ‌చ్చ‌లు కూడా త‌గ్గుముఖం ప‌డ‌తాయి. బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో పైనాపిల్ ముక్కతో స్క్రబ్ చేయాలి . ప‌ది నిమిషాలు స్క్రబ్ చేసిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ముఖానికి పోషణ అందివ్వడంతో పాటు, డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమ‌లు కూడా త‌గ్గుతాయి. 


logo