మంగళవారం 07 జూలై 2020
National - Jun 26, 2020 , 00:23:48

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .1.2 కోట్ల విరాళాన్ని ప్రకటించిన టకేడా ఇండియా

పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .1.2 కోట్ల విరాళాన్ని ప్రకటించిన టకేడా ఇండియా

 ఢిల్లీ : ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ సంస్థ టకేడా ఇండియా పిఎమ్ కేర్స్ ఫండ్‌కు రూ . 1.2 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కరోనా కు వ్యతిరేకంగా పోరాడేందుకు తన వంతుగా  ఆర్ధిక సాయం అందించింది. రోగులకు వినూత్న చికిత్సలను అందించడంతోపాటు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో టకేడా ముందు వరుసలో ఉన్నది. "ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి సాయం అందిఇవ్వడానికి టకేడా కట్టుబడి ఉందని, ఒక సంస్థగా, మేము ఎల్లప్పుడూ మా విలువలు - సమగ్రత, నిజాయితీకి అనుగుణంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని "టకేడా ఇండియా జనరల్ మేనేజర్ కోకి సాటో తెలిపారు. టకేడా ఇండియా గతంలో పలు ఎన్జీఓ సంస్థలతో కలిసి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)‌లో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని కోకి సాటో చెప్పారు. 


logo