గురువారం 16 జూలై 2020
National - Jun 25, 2020 , 23:52:25

పెండ్లి పేరుతో కిలాడీ లేడీ మోసం

పెండ్లి పేరుతో  కిలాడీ లేడీ మోసం

బెంగళూరు :  పెండ్లి పేరుతో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి మోసం చేసింది  ఓ కిలాడీ లేడీ. అతని దగ్గర 16 లక్షలకు పైగా దోచేసింది. బెంగళూరులో అంకుర్ శర్మ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మేట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా కిరారా శర్మ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. బాగా క్లోజ్ అవటంతో ఓ రోజు కిరారా శర్మ  పెళ్లి చేసుకుందామా అని చెప్పింది . అంకుర్ శర్మ అమ్మాయి పై నమ్మకం ఏర్పడింది.  ఇది అవకాశంగా చేసుకున్న అంకుర్ శర్మ అతని నుంచి ఏకంగా రూ. 16.82 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా అత న్ని  పాటించుకోకుండా వదిలేసింది . ఆ తరువాత కిలాడీ లేడీ ముందు వివాహానికి ఒప్పుకున్న, తర్వాత ఒప్పుకోకుండా తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా కామ్ గా సెల్ ఫోన్ స్విచాఫ్ చేసి తనకి ఆ యువకుడికి ఉన్న పరిచయ స్థలాల నుండి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. దీంతో ఆ సాఫ్ట్వేర్ యువకుడు అంకుర్ శర్మ మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 


logo