శుక్రవారం 03 జూలై 2020
National - Jun 25, 2020 , 23:31:14

మాక్స్ బుపా తో ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యం

మాక్స్ బుపా తో ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యం

బెంగళూరు: ప్రముఖ డిజిటల్ బ్యాంక్  ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అగ్రగామి ఆరోగ్య బీమా సంస్థ మాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ తో   ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం కింద బ్యాంక్  ఖాతాదారులకు మాక్స్ బూపా నాణ్యమైన ఆరోగ్య బీమా పరి ష్కారాలను  అందించనున్నది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాంక్ వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా పథకాలను మాక్స్ బూపా ద్వారా అందించనుంది. స్టాండర్డ్ రిటైల్ , కస్టమైజ్ చేసుకోదగిన గ్రూప్ ప్లాన్స్ రెండిం టినీ ఇది అందించ నుంది. హాస్పిటలైజేషన్ కు సంబంధించి అన్ని అవసరాలను తీర్చగల సమగ్ర ఇండెంట్ ప్లాన్  హెల్త్ కంపానియన్, తీవ్ర అనారోగ్యం, వ్యక్తిగత ప్రమాదాలకు రక్షణ అందించే ఫిక్స్ డ్ బెనిఫిట్ ప్లాన్ హెల్త్ అస్యూరన్స్ వంటి ప్రయోజనాలున్నాయి.

డిజిటల్ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం మాక్స్ బూపా బైట్ సైజ్డ్ (సూక్ష్మ స్థాయి) ఉత్పాదనలను ఆన్ లైన్ లో  ఒకే క్లిక్  ద్వారా కొనుగోలు చేసే లా ఆప్షన్ ను అందించనుంది. ఖాతా ప్రారంభించే సమయంలోనే వీటి కొనుగోలుకు వీలు కల్పించనుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వినియోగదారులు తక్కువ వ్యయం గల, అధిక విలువను అందించే బీమా ఉత్పాదనల ను అందించనున్నది. ‘‘కస్టమర్ల కు నాణ్యమైన సేవలు అందించాల నే మా లక్యం లో భాగంగానే మాక్స్ బూపా తో భాగస్వా మ్యం చేసుకున్నాం". ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మేము కస్టమర్లకు తగిన సేవలను అందిస్తున్నాం" అని  ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో  రాజీవ్ యాదవ్ అన్నారు.


logo