ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 22:33:36

కర్ణాటకలో పెరుగుతున్నకరోనా కేసులు

కర్ణాటకలో పెరుగుతున్నకరోనా కేసులు

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 442 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10580 కు చేరుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3716 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి. మరోవైపు నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 519 మంది కరోనా వైరస్ నుంచి బయట పడి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 6,670 మంది హాస్పిటల్ నుంచి   డిశ్చార్జ్ అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్నారు. ఈ ఒక్కరోజే రాష్ట్రం మొత్తం ఆరుగురు కరోనా తో  మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు 180 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.  


logo