గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 21:47:01

'తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది సుశాంత్‌లు ఉన్నారు'

'తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది సుశాంత్‌లు ఉన్నారు'

బెంగళూరు: తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది సుశాంత్‌లు ఉన్నారని ప్రముఖ డిజైనర్ వాసుకి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ లో నటీనటులతో పాటు ఇతర సిబ్బంది ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదనే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. " తమిళ చిత్ర పరిశ్రమలో చాలా మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లు ఉన్నారని, వారికి "పే మెంట్లు, మద్దతు, గానీ  గుర్తింపు గానీ లభించవ" ని చెప్పారు. " ఎన్నిబాధలున్నా వారు కెమెరా ముందు చిరునవ్వు చిందిస్తున్నారని ." "అటువంటి వారిలో కొంతమంది నాతో మాట్లా డారు. వీరిలో కొద్దిమంది లోలోపల బాధతో మౌనంగా ఉంటారు" అని వాసుకి పేర్కొన్నారు.

 


logo