శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 20:15:17

పుట్టగొడుగుల గురించి తెలియని నిజాలు...

 పుట్టగొడుగుల గురించి తెలియని నిజాలు...

హైదరాబాద్: పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,000 జాతుల పుట్టగొడుగులు ఉన్నాయి. ఎక్కువ తడిగా ఉండే ప్రదేశాల్లో కనిపిస్తాయి. అంతేకాదు వీటిలో కొన్ని జాతులకు చెందిన మష్రూమ్స్ నీటిలో కూడా మొలకెత్తుతాయి. పుట్టగొడుగులు చనిపోయిన మొక్కలను రీసైకిల్ చేసి విలువైన పోషకాలను భూమిలోకి తిరిగి ఇస్తాయి. పుట్టగొడుగు మంచి పోషకాలున్న  ఆహారం. రాగి , పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలతో పాటు చాలా రకాల పుట్టగొడుగుల్లో విటమిన్ బి, కాపర్, పొటాషియం ఉంటాయి. ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది.

సాంప్రదాయ చైనీస్ ఔషధాల తయారీలో పుట్టగొడుగులను కొన్ని శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం లభిస్తుంది. పుట్టగొడుగులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీఆక్సిడెంట్లుగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటును తగ్గించడానికి, రక్తంలో చక్కెరను తగ్గించడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పుట్టగొడుగులు సాయపడుతాయి.


logo