సోమవారం 06 జూలై 2020
National - Jun 25, 2020 , 19:08:06

క్యాన్సిల్ చేసిన రైలు టికెట్ల రీఫండ్ ను ఎలా పొందాలంటే...?

క్యాన్సిల్ చేసిన రైలు టికెట్ల రీఫండ్ ను ఎలా పొందాలంటే...?

హైదరాబాద్: రైల్వే శాఖ రెగ్యులర్ రైళ్లలో బుక్ చేసుకున్నటికెట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే... క్యాన్సిల్ చేసిన టికెట్లకు సంబంధించిన రీఫండ్ ను ఎలా పొందాలంటే...?  పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్నట్టైతే మీ ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల లోపు ఎప్పుడైనా రీఫండ్ పొందే వీలుంటుంది. ఆ ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో టికెట్ డిపాజిట్ రిసిప్ట్(టీడీఆర్ ) ఫైల్ చేయాల్సి ఉంటుంది. 60 రోజుల్లో చీఫ్ క్లెయిమ్ ఆఫీసర్ / సీసీఎం రీఫండ్ ఆఫీసుల్లో డీటెయిల్డ్ టీడీఆర్ ఫైల్ చేయాలి. వెరిఫికేషన్ తర్వాత రీఫండ్ లభిస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు 139 రైల్ సంపర్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా రైలు టికెట్లు క్యాన్సిల్ చేయవచ్చు. ప్రయాణికులు బుక్ చేసుకున్న అన్ని టికెట్ల పైనా ఫుల్ రీఫండ్ వస్తుంది. 

 ఇ-టికెట్స్ అంటే ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసినట్టైతే ఆ టికెట్లు ఆటోమెటిక్‌గా క్యాన్సిల్ అవుతాయి. వారికి ఫుల్ రీఫండ్ లభిస్తుంది. ఈ ప్రాసెస్ రైలు రద్దు కాకపోయినా ప్రయాణికులు రైలులో ప్రయాణించొద్దనుకుంటే రిజర్వ్‌డ్ ప్రయాణికులకు భారతీయ రైల్వే ఫుల్ రీఫండ్ ఇస్తుంది. పీఆర్ఎస్ కౌంటర్లలో తీసుకున్న టికెట్లతో పాటు ఇ-టికెట్స్‌కు ఇది వర్తిస్తుంది. ఇక ఇప్పటికే రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినవారికి కూడా పూర్తి రీఫండ్ వస్తుంది. అంటే క్యాన్సలేషన్ ఛార్జీలు కూడా రీఫండ్ చేస్తుంది రైల్వే. 2020 మార్చి 21 తర్వాత మీరు ఎప్పుడు రైలు టికెట్లు క్యాన్సిల్ చేసినా మీరు పూర్తి రీఫండ్ పొందడానికి అర్హులు. మీ దగ్గర ఇప్పటికే క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేసినట్టైతే వాటి కోసం అప్లై చేయొచ్చు. పీఆర్ఎస్ కౌంటర్లలో టికెట్లు తీసుకొని క్యాన్సిల్ చేసిన ప్రయాణికులు క్యాన్సలేషన్ ఛార్జీల రీఫండ్ కోసం మీ ప్రయాణ తేదీ నుంచి 60 రోజుల్లో చీఫ్ క్లెయిమ్ ఆఫీసర్ / సీసీఎం రీఫండ్ ఆఫీసుల్లో అప్లై చేయాలి.ఇక ఐఆర్‌సీటీసీ ప్లాట్‌ఫామ్స్‌లో టికెట్లు తీసుకొని 2020 మార్చి 21 తర్వాత క్యాన్సిల్ చేసినట్టైతే వారికి క్యాన్సలేషన్ ఛార్జీలు ఆటోమెటిక్‌గా క్రెడిట్ అవుతాయి. మీరు రైలు టికెట్లు బుక్ చేసేప్పుడు ఉపయోగించిన క్రెడిట్, డెబిట్, కార్డులు, అకౌంట్లు, వ్యాలెట్లలోకే రీఫండ్ వస్తుంది. అంటే మీరు టికెట్ బుకింగ్ సమయంలో పేటీఎం వ్యాలెట్ ఉపయోగించినట్టైతే తిరిగి పేటీఎం వ్యాలెట్‌లోకే రీఫండ్ డబ్బులు వస్తాయి. కరోనావైరస్ సంక్షోభం కారణంగా టికెట్ క్యాన్సలేషన్, రీఫండ్ రూల్స్‌లో ఈ మార్పులు చేసింది రైల్వే. 2020 మార్చి 21 నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు పీఆర్ఎస్ కౌంటర్ జనరేటెడ్ టికెట్స్, ఇ-టికెట్స్‌కు కొత్త రీఫండ్ రూల్స్‌ అమలులో ఉంటాయి.

ఇక ఇప్పటివరకు మీ టికెట్లను మీరు క్యాన్సిల్ చేయకపోతే వాటిని రద్దు చేయకపోవడమే మంచిది. మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే క్యాన్సలేషన్ ఛార్జీలు వర్తించే అవకాశముంది. గతంలో ఈ సమస్య వచ్చింది. దీంతో ఆ ప్రయాణికులు మళ్లీ క్యాన్సలేషన్ ఛార్జీల రీఫండ్ కోసం దరఖాస్తు చేయాల్సి వచ్చింది. అందుకే ఐఆర్‌సీటీసీ మీ టికెట్లు క్యాన్సిల్ చేసే వరకు వెయిట్ చేయండి. ఒకేసారి లక్షలాది రైలు టికెట్లు రద్దు అయ్యాయి కాబట్టి రీఫండ్ ప్రాసెస్‌కు కాస్త సమయం తీసుకుంటుంది. రీఫండ్ రాకపోతే కంగారుపడాల్సిందేమీ లేదు. టికెట్లు క్యాన్సిల్ అయిన 4 నుంచి 7 రోజుల్లో రీఫండ్ అకౌంట్‌లో జమ అవుతుంది. రీఫండ్ విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాన్సలేషన్ ఛార్జీలు డిడక్ట్ అయినా తిరిగి రీఫండ్ పొందొచ్చు.


logo