గురువారం 09 జూలై 2020
National - Jun 25, 2020 , 18:53:11

పక్షులను పెంచుకుంటున్న గ్రామం

పక్షులను పెంచుకుంటున్న గ్రామం

హైదరాబాద్ : జీవవైవిధ్యం వల్లనే ఈ ప్రకృతిలో  సీజన్ ను బట్టి  ఎప్పుడు జరగాల్సిన కార్యాలు అప్పుడు జరుగుతున్నాయి. ప్రతి జీవి ప్రకృతికి మేలు చేసేదే నన్న విషయాన్ని గ్రహించాలి . మానవ తప్పిదాలతో అనేక జంతువులు కనుమరుగయ్యే పరిస్థితులేర్పడ్డాయి.  ఓగ్రామం వాసులు సరిగ్గా ఇదే విషయాన్నిగుర్తించారు.కర్ణాటక లోని కొక్రే బేళ్లుర్ గ్రామం పక్షులు, మనుషులు కలగలిసి ఎలా సహజీవనం చేయవచ్చని నిరూపిస్తున్నది. ఇంటి వసారా లో అరుదైన పక్షులు కిల కిలా రావాలు చేస్తూ,చెట్టుపై పక్షి గూళ్ల తో  కొక్రే బేళ్లుర్ గ్రామంతా తమవంతుగా పర్యావరణానికి మేలు చేస్తున్నారు.ఇంటిపై వాలే పావురాలు, ఇతర సహజ పక్షుల సంఖ్య తగ్గిపోతుందని ప్రకృతి ప్రేమికులు బాధ పడుతుంటారు. బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వారి లెక్కల ప్రకారం భారతదేశం లో 82 రకాల పక్షి జాతులు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి.

కొక్రే బేళ్లుర్ గ్రామం కర్ణాటక రాష్ట్రంలో మద్దూర్ తాలూకా లో ఉన్నది. ఈ గ్రామంలో నే పక్షులు, మనుషులు కలిసిపోయారు. కన్నడ భాష లో పక్షిని కొక్కరే అని పిలుస్తారు. ఆ పేరు మీదనే ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. అరుదైన పేలికాన్ పక్షులు కూడా ఈ గ్రామంలో చూడవచ్చు. అనేక రకాలైన అరుదైన పక్షి జాతుల ను ఈ గ్రామంలో పెంచుతున్నారు. గ్రామంలో ని చెట్ల పై గూళ్ళు పెట్టుకొని పక్షులు గ్రామస్తులతో కలిసి జీవిస్తాయి. మే నెలలో కనుక మనం ఈ గ్రామానికి వెళితే కొత్తగా పుట్టిన పక్షి పిల్లల కూతలతో పర్యావరణ పరిరక్షణ కు దోహదం చేస్తున్నాయి. గ్రామస్తులు ఈ పక్షులను తమ కుటుంబ సభ్యులవలే  సంరక్షిస్తారు. గాయపడ్డ పక్షులకు ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.

ఈ పక్షులన్నీ ఎలాంటి భయం లేకుండా గ్రామస్తుల తో అతి దగ్గరగా తిరుగుతాయి. భారతదేశం లో ఉన్న 21 పక్షి సంతానోత్పత్తి కేంద్రాలలో కొక్రే బేళ్లుర్ ఒకటి. గ్రామస్తులు ఈ పక్షులను పెంచుకోవడం తమ సంస్కృతి గాను అదృష్టం గాను భావిస్తారు. పక్షి రెట్టల వల్ల  మంచి ఎరువుగా భూమి సారవంతం అవుతుంది.1976 లో ఎస్ జి నేగింహాల్ అనే అటవీ అధికారి పేలికాన్ పక్షులను అభివృద్ధి చేయడానికి ఈ గ్రామస్తులకు కొంత నష్ట పరిహారాన్ని చెల్లించే పద్దతిలో మొదలు పెట్టారు. అదే విధానం  దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఇవి పంటలను పాడు చేసినా కర్ణాటక ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుంది.


logo