మంగళవారం 07 జూలై 2020
National - Jun 25, 2020 , 16:58:48

ఆగస్టు వరకూ రైళ్లు లేనట్టే...

 ఆగస్టు వరకూ రైళ్లు లేనట్టే...

ఢిల్లీ : ఆగస్టు 15 వతేదీ వరకూ కొత్త రైళ్లు లేనట్టే ... ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల టికెట్లను రద్దు చేసిందిఇండియన్ రైల్వే . అందుకు సంబంధించిన మొత్తాన్ని వారికి అందించేందుకు ప్రత్యేకంగా సర్కులర్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 14 న లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ... టిక్కెట్ల నగదు వాపసు పొందేందుకు అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆగస్టు 15 వరకూ  పరోక్షంగా  రైళ్లు లేకపోవచ్చని సూచన ప్రాయంగా తెలిపింది. దేశీయ విమానాలు ఆంక్షలతో తిరిగి ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం 230 ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల తోనే రైల్వే శాఖ ప్రజారవాణా అవసరాలు తీరుస్తున్నది. 120 రోజుల పాటు టికెట్ల ముందస్తు బుకింగ్‌ను రైల్వే అనుమతించింది.  జూన్ 30 వరకు అన్ని సాధారణ రైళ్ల నిర్వహణను రైల్వే గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.  


logo