శుక్రవారం 10 జూలై 2020
National - Jun 25, 2020 , 12:57:24

ఒక కుమారుడి కోసం.. ఐదుగురు కుమార్తెలు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శలు

ఒక కుమారుడి కోసం.. ఐదుగురు కుమార్తెలు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శలు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జితు పట్వారీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ప్రధాని మోదీ ఎన్నికల నినాదమైన ‘సబ్‌కే సాత్‌.. సబ్‌కే వికాశ్‌’పై ఆయన విమర్శలు చేయబోయి వివాదంలో పడ్డారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యాన్ని కుమార్తెలతో, అభివృద్ధిని కుమారుడితో ఆయన పోల్చారు. ‘ప్రజలు అభివృద్ధి (వికాశ్‌) అనే కుమారుడ్ని ఆశిస్తే..  పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి ఐదుగురు కుమార్తెలను పొందారు. ఈ ఐదుగురు కూతుర్లు పుట్టారుగాని, వికాశ్‌ అనే కుమారుడు ఇంకా జన్మించలేదు’ అని బుధవారం వ్యాఖ్యానించారు. 

కాగా, దీనిపై విమర్శలు రావడంతో మాజీ మంత్రి అయిన జితు పట్వారీ గురువారం క్షమాపణ చెప్పారు. కుమార్తెలను దేవతలుగా ఆయన అభివర్ణించారు. మరోవైపు కుమార్తెలపై హేళనగా మాట్లాడిన జితు పట్వారీపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎలాంటి చర్యలు తీసుకుంటారని  మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ప్రశ్నించారు. కాగా, జాతీయ మహిళా సంఘం కూడా జితు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన నుంచి వివరణ కోరుతామని ట్విట్టర్‌లో పేర్కొన్నది.  logo