శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 00:55:59

కియా కార్నివాల్ ఎమ్‌పివి ఫీచర్స్ ఇవిగో...

 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఫీచర్స్ ఇవిగో...

బెంగళూరు : కియా మోటార్స్ తమ సరికొత్త 2021 'కార్నివాల్' ఎమ్‌పివి ని సరికొత్త హంగులతో రూపొందించింది .దీని ఫీచర్లు చుస్తే...  కొత్త కార్నివాల్ ఎమ్‌పివిలో కూడా అన్ని కియా కార్ల మాదిరిగానే ఈ బ్రాండ్ సిగ్నేచర్ ‘టైగర్-నోస్' గ్రిల్ కనిపిస్తుంది. అయితే, ఇందులో కొత్త డైమండ్ ప్యాటర్న్ గ్రిల్, కారు ముందు భాగానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ కారులో పూర్తి కొత్తగా కనిపించే హెడ్‌ల్యాంప్ యూనిట్, కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో పాటు వ్రాప్ అరౌండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కనిపిస్తాయి. కొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్లలో అనూహ్యమైన మార్పులు చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లలో ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇప్పుడు సరికొత్త స్టైల్ తో పాటు నూతన ఫీచర్ల ను అందిస్తున్నారు. మా అంచనా ప్రకారం, క్యాబిన్‌లో కూడా కీలకమైన మార్పులు ఉండొచ్చట. కొత్త కియా కార్నివాల్ ఇంజన్ ఆప్షన్స్‌ని కూడా కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుత తరం కార్నివాల్ ఎమ్‌పివిలో ఉపయోగిస్తున్న 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌, 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లనే కొత్త ఎమ్‌పివిలో కూడా కొనసాగించే ఆస్కారం ఉంది. ఇంకా ఇందులో ఎలక్ట్రిక్ మోటారుతో కూడిన 1.6-లీటర్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అంతర్జాతీయ మార్కెట్లలో అందిస్తున్నది.logo