ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 23:20:49

మరోసారి పెరిగిన పసిడి ధర

మరోసారి పెరిగిన పసిడి ధర

ముంబై : దేశంలో కరోనా కేసులు నాలుగున్నర లక్షలకు పెరిగాయి. మరణాలు పద్నాలుగున్నర వేలకు చేరుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపాయి. పసిడి ధరలు బుధవారంపెరిగాయి. కరోనా కేసుల ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు వంటి వివిధ కారణాలతో పసిడి ధర నేడు పెరుగుదలతో ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వివిధ ఆర్థిక వ్యవస్థలు మరిన్ని ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. బుధవారం ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.04 శాతం ఎగిసి రూ.48,251 పలికింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర 0.16 శాతం తగ్గి రూ.48,704 పలికింది.  


logo