గురువారం 02 జూలై 2020
National - Jun 24, 2020 , 01:18:26

ఉచితంగా "స్వస్త్ " ఆన్ లైన్ హెల్త్‌కేర్ సేవలు

 ఉచితంగా

బెంగళూరు :  దేశవ్యాప్తంగా టెలిమెడిసన్ సేవల్నిఅందించేందుకు ముందుకు "స్వస్త్ " ముందుకు వచ్చింది . స్వస్త్‌ను ప్రారంభించేందుకు 100కు పైగా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఏకతాటిపైకి వచ్చారు. భారతదేశంలోని అత్యుత్తమ వైద్యులు ,వెల్‌నెస్ ప్రొవైడర్లను ఆన్ లైన్ లో కలిసే అవకాశాన్ని స్వస్త్ అందిస్తుంది. ఈ మొబైల్ యాప్ ఆధారిత సేవలు అందుబాటు ధరలలో ఆరోగ్య సంరక్షణ సేవలను 130కోట్ల మంది భారతీయులకు ఆర్ధిక, భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అందించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.

స్వస్త్ గవర్నింగ్ కౌన్సిల్‌లో భాగమైన క్రిస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ " ప్రజా ఆరోగ్య లక్ష్యాలను తీర్చడం కోసం స్వస్త్ పనిచేయడంతో పాటు  వైద్య మండలి, ప్రజా ఆరోగ్య సంస్థలు , ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించనుంది''అని అన్నారు. అవసరమైన సంరక్షణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత చికిత్సను స్వస్త్ అమలు చేయడంతో పాటు, డిజిటల్‌  సంతకం చేసిన ప్రిస్క్రిప్షన్, చికిత్స సలహాను అందిస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఆంగ్లం, గుజరాతీ భాషలలో కన్సల్టేషన్స్ అందిస్తుంది. త్వరలోనే భారతదేశంలోని 25 భాషలలో సైతం ఇది కన్సల్టేషన్స్‌ను అందించనుంది.


logo