మంగళవారం 14 జూలై 2020
National - Jun 24, 2020 , 00:48:34

ఔదార్యాన్ని చాటుకుంటున్న జీ తెలుగు

ఔదార్యాన్ని చాటుకుంటున్న జీ తెలుగు

హైదరాబాద్: రోజురోజుకి పెరుగుతోన్న కోవిడ్‌ కేసులు కలవరపాటుకి గురిచేస్తున్నాయి. మహమ్మారిపై పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడమే కాకుండా అవసరమైన వారికి వివిధ కార్యక్రమాల రూపంలో సహాయాన్ని అందిస్తు న్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి స్ఫూర్తి పొందిన జీ తెలుగు కూడా తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగానికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

భారతదేశంలోని 10 నగరాల్లో వైద్య పరికరాలను అందివ్వాలనే జీ నెట్‌వర్క్‌ సంకల్పంలో భాగంగా వైద్య పరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తున్నది జీ తెలుగు. కోవిడ్‌ మహమ్మారిపై పోరాడే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జీ తెలుగు.. 4,000 పిపిఈ కిట్లు, 16 అంబులెన్స్‌లను అందజేయనున్నట్టు బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు ,సీనియర్ హెచ్ ఆర్  బిజినెస్ పార్టనర్ - సౌత్, శ్రీధర్ మూలగడ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు తెలిపారు. కోవిడ్‌ మహమ్మారిపై పోరాడేందుకు జీ తెలుగు చేస్తున్న ప్రయత్నాలను ట్విట్టర్‌ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లైక్‌ చేశారు.

దేశవ్యాప్తంగా 10,000 మంది వలస కార్మికులకు మద్దతుగా 200 అంబులెన్సులు, 40,000 పిపిఇ కిట్లు, 100 పోర్టబుల్ ఐసియులు మరియు 6,00,000 రోజువారీ భోజన ఖర్చుని విరాళంగా ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక అధికారులకు మద్దతు ఇస్తామని జీ నెట్‌వర్క్ ప్రతిజ్ఞ చేసింది. నోయిడా, ముంబై, చండీగఢ్‌, జైపూర్, కోల్‌కతా, భువనేశ్వర్, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి మరియు చెన్నై నగరాల్లో జీ నెట్‌వర్క్‌ తన సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇక జీ తెలుగు కూడా సహాయ కార్యక్రమాల్లో ముందుంది. జీ తెలుగులో ప్రసారమయ్యే 16 కార్యక్రమాల ద్వారా రూ.35 లక్షలను దాదాపు 400 కుటుంబాలకు అందించింది. అంతేకాకుండా మొదటి దశ లాక్‌డౌన్‌ సమయంలో..  టీవీ కార్మికుల కోసం జీ తెలుగు , జీ సినిమా ఉద్యోగులు రూ.1,50,000 విరాళంగా అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. 


logo