మంగళవారం 07 జూలై 2020
National - Jun 24, 2020 , 00:37:41

ఎటువంటి వారికి ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది ?

ఎటువంటి వారికి ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది ?

హైదరాబాద్ : కవల పిల్లలు అందరికీ పుట్టరు..ట్విన్స్ పుట్టడం అనేది చాలా  అరుదుగా జరుగుతుంది. కొంతమంది కవల పిల్లలు కావాలని కోరుకుంటారు. ట్విన్స్ ఎటువంటి మహిళలకు ఎక్కువగా పుట్టే అవకాశాలు ఉన్నా యంటే ....  మహిళల వయసు 35 దాటిన తర్వాత పిల్లలను కనాలనుకునేవారికి కవలలు పుట్టే చాన్స్ ఎక్కువగా ఉన్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 35 ఏండ్లు  దాటిన వారిలో విడుదలయ్యే అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి రెండు అండాలు విడుదలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయట..బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట.చాలా రోజుల పాటు పిల్లలు పుట్టకుండా రకరకాల పద్ధతులు పాటించిన వాళ్లు.. ఒకేసారి వాటిని ఆపేసి పిల్లల కోసం ప్లాన్ చేస్తే అండాలు రెండు కానీ అంత కంటే ఎక్కువ విడుదల అవుతాయట. అటువంటి వాళ్లకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంటుంది .ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో, మల్టి విటమిన్ టాబ్లెట్లను అధికంగా వేసుకునే వారిలో.. డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. 

 logo