ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 00:21:20

శృంగార సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు

 శృంగార సామర్థ్యాన్ని పెంచే యోగాసనాలు

హైదరాబాద్: శృంగారం అనేది మనిషి దైనందిన జీవితంలో జరిగే ఒక ప్రక్రియ.. అయితే నేడు మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల  శృంగారంలో ఎక్కువ సేపు తృప్తి పొందలేక పోతున్నారు కొందరు. పరిష్కారం కోసం  డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా కూడా వాళ్లకు ఎటువంటి ప్రయోజనం కలుగకపోవచ్చు. అటువంటి వారు యోగాసనాల ద్వారా అలాంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. యోగాలో నాలుగు రకాల ఆసనాల ద్వారా శృంగార సామర్థ్యాన్నిపెంచుకోవచ్చు. ధనురాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, హలాసనం, సూర్య నమస్కారం వంటి ఆసనాల ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సెక్స్ సామర్థ్యం తగ్గుతున్నట్లయితే తప్పకుండా పై ఆసనాలు ప్రయత్నించండి.సెక్సువల్ ఫిట్‌నెస్‌కు, యోగాకు మంచి సంబంధమున్నదని, ఇది రోజూ చేయడం వల్ల సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని యోగా గురువులు అంటున్నారు. యోగాలో పద్మాసనం చాలా ముఖ్యమైనది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా మనసు నియంత్రణలో ఉండి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.  


logo