బుధవారం 08 జూలై 2020
National - Jun 24, 2020 , 19:13:12

స్వచ్చమైన తేనే ను ఎలా గుర్తించాలి ?

స్వచ్చమైన తేనే ను ఎలా గుర్తించాలి ?

హైదరాబాద్ : మార్కెట్ లో మనం కొనే తేనే స్వచ్చమైనదేనా కాదా. మంచే తేనే అని ఎలా గుర్తించాలి. వాళ్ళు అమ్మే తేనెలో పంచదార లేదా బెల్లం  పానకం కలుపుతారా అంటూ ఎన్నో సందేహాలు మనలో కలుగుతాయి. అయితే స్వచ్చమైన తేనెని గురించడానికి ఎంతో సులభమైన మార్గాలున్నాయి. స్వచ్చమైన తేనే కు మండే స్వభావం ఉంటుంది. అందుకే తేనే కొనే ముందు ఒక అగ్గిపుల్లని తీసుసుకుని దానిని తేనెలో ముంచి అగ్గి పుల్లని వెలిగించండి. అది గనుక వెలిగితే అది స్వచ్చమైన తేనే అని గుర్తించాలి.

వాస్తవానికి బెల్లం పాకం లేదా పంచదార పాకం కలిపిన తేనే వెలగదు. ఒక గ్లాసు లో నీళ్ళు తీసుకుని అందులో ఒక చెంచాడు తేనే కలుపాలి. ఆ తరువాత అందులో కొంచం వెనిగర్ వేయాలి ఒక వేళ అందులోంచి నురుగు వస్తే అది కల్తీ తేనేగా గుర్తించాలి . ఇలాంటి పద్దతే మరొకటి ఉంది. ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ తేనే కలపండి. ఈ కలిపే విధానం కూడా చెంచాతో కాకుండా తేనే వేయగానే అటూ ఇటూ ఊపుతూ కలపాలి, ఇలా చేయగానే తేనే నీటిలో కలిసి పొతే అది కల్తీ తేనే గా గుర్తించండి. అదే తేనే గ్లాసు అడుగు భాగానికి చేరుకుంటే అది స్వచ్చమైన తేనే అని గ్రహించాలి. 


logo