మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 21:45:57

అనసూయ సొంతూరి ఫొటోలు వైరల్

అనసూయ సొంతూరి ఫొటోలు వైరల్

హైదరాబాద్: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఏం  చేసినా ఈ మధ్య  వైరల్ అవుతున్నది. బుల్లితెరపై మరోవైపు వెండితెరపై తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటున్నది. వెండితెరపై వరుస  అవకాశాలను అందుకుంటూనే బుల్లితెరపై కూడా యాంకర్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న  అనసూయ భరద్వాజ్ తన సినిమాలు షో లకు సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేయడంతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ కూడా ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. అనుభవాలను అభిమానులతో పంచుకున్నది.

ఇటీవలే అనసూయ భరద్వాజ్ తన తల్లి అనురాధ తో కలిసి సొంతూరైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్ళిన అనసూయ భరద్వాజ్ చేనేత కార్మికులందరినీ  పరామర్శించారు. అంతేకాకుండా "చేనేత కార్మికులు తయారుచేసిన ఉత్పత్తులు లాక్ డౌన్ కారణంగా అమ్ముడు పోకుండా అలాగే ఉన్నాయనివీరికి అందరూ అండగా నిలవాలంటూ  తన అభిమానులను కోరారు అనసూయ భరద్వాజ్. అంతేకాకుండా తన సొంతూరు లోని పలువురు చేనేత కార్మికులకు పేదలకు నిత్యావసరాలను కూడా పంపిణీ చేశారు. అయితే తాజాగా తన సొంతూరు లోని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలను  ఇన్ స్టాగ్రామ్ వేదిక అభిమానులతో పంచుకున్నారు. గ్రామంలోని పలు అందమైన ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగిన అనసూయ భరద్వాజ్... చేనేత దుస్తులు ధరించి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


logo