శనివారం 11 జూలై 2020
National - Jun 23, 2020 , 23:48:48

క్రికెటర్ అశ్విన్ పై నెటిజన్లకు కోపం ఎందుకు వచ్చింది?

క్రికెటర్ అశ్విన్ పై నెటిజన్లకు కోపం ఎందుకు వచ్చింది?

ముంబై : రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన పెంగ్విన్ కొద్దీ రోజుల క్రితం డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టీజర్,ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి అయితే సినిమా విడుదలైన తరువాత మాత్రం అంచనాలను అందుకోవడం కాదు కదా యావరేజ్ అని కూడా అనిపించుకోలేకపోయింది. కీర్తి నటన,సినిమాటోగ్రఫీ , బీజీఎమ్ మాత్రమే బాగున్నాయని సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. అయితే టీంఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం కొంచెం భిన్నంగా స్పందించాడు. పెంగ్విన్ గురించి పాజిటివ్ రివ్యూస్ విన్నాను అందుకే ఆదివారం రాత్రి సినిమా చూశా... సినిమా లో కీర్తి నటన, బీజీఎమ్ బాగుందని అశ్విన్ ట్వీట్ చేశాడు. సినిమా గురించి పెద్దగా పొగడలేదు కానీ పాజిటీవ్ రివ్యూస్ అని అనడంతో నెటిజన్లకు కోపం వచ్చినట్లుంది. దాంతో సినిమా ప్రమోట్ చేయడానికి ఎంత తీసుకున్నావ్.. పాజిటీవ్ రివ్యూస్ ఎక్కడొచ్చాయి , అబద్దం చెప్పకు అశ్విన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.  


logo