శనివారం 04 జూలై 2020
National - Jun 23, 2020 , 23:32:54

మెగా హీరోతో వెబ్ సిరీస్ కు సిద్ధమవుతున్న పూజాహెగ్డే

 మెగా హీరోతో వెబ్ సిరీస్ కు సిద్ధమవుతున్న పూజాహెగ్డే

హైదరాబాద్: అతితక్కువ సమయంలో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూజ హెగ్డే.. ఆమె అపాయింట్ మెంట్ కోసం దర్శక, నిర్మాతలు డేట్స్ ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి కి ఎదిగింది. కోలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా తెలుగు సినిమా పరిశ్రమ వైపే ఆమె ఆసక్తి చూపుతున్నది. బాలీవుడ్ లో కూడా ఆమెకు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ అమ్మడుకు. ఆమె ఓ వెబ్ సీరీస్ ని మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి చెయ్యాలని ప్లాన్ చేస్తుందట. అందుకు ఆమె ఇప్పటికే ఒక కథను కూడా వరుణ్ తేజ్ కు పంపింది. త్వరలోనే దీనికి సంబంధించి ఓ ప్రకటనలో ఆ టైటిల్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందో ... వేచి చూడాలి. logo