సోమవారం 13 జూలై 2020
National - Jun 23, 2020 , 15:51:02

తిరుమంజనం అంటే ఏంటో తెలుసా?

 తిరుమంజనం అంటే ఏంటో తెలుసా?

హైదరాబాద్ : తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం. కోయిల్ అళ్వార్ అంటే పవిత్ర ఆలయం, ఆళ్వార్ అంటే భక్తులు, తిరుమంజనం అంటే సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేయడం. భక్తులు ఆలయాన్నిశుభ్రం చేయడాన్నే కోయిల్ అళ్వార్ తిరుమంజనం అంటారు. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి లో మూల విరాట్ ని నీళ్లు పడకుండా కప్పి ఉంచుతారు. మిగతా విగ్రహాలను, ఇతర సామాగ్రిని బయటు తీసి కర్పూరం, గంధం, కుంకుమ పువ్వు,పసుపు గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ ఈ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలంతో ఆలయం మొత్తం సంప్రోక్షణం చేస్తారు.logo