శుక్రవారం 03 జూలై 2020
National - Jun 23, 2020 , 15:26:08

బెంగళూరులో లాక్ డౌన్

బెంగళూరులో లాక్ డౌన్

బెంగళూరు : కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మహమ్మారి కట్టడి కోసం అక్కడి సర్కారు మరోసారి లాక్ డౌన్ విధించింది. సోమవారం నుంచి కర్ణాటక ప్రభుత్వం బెంగళూరునగరంలో ఐదు ప్రాంతాల్లో14 రోజుల పాటులాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలల లాక్డౌన్ తర్వాత సడలింపును ప్రజలు  దుర్వినియోగం చేయడంపై యడియూరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులతో పాటు, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలని ఆయన  అధికారులకు సూచించారు. జూన్ 22 న కర్ణాటకలో కొత్తగా 249 కోవిడ్-19 కేసులు నమోదు కాగా... ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం  ఇప్పటివరకు 9,399 కోవిడ్ కేసులుండగా , మరణాల సంఖ్య 142 కు చేరుకున్నది. సోమవారం చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు బెంగళూరు పట్టణానికి చెందినవారే. కర్ణాటక రాజధాని బెంగళూరులోనే  కొత్తగా 126 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలబురగి -27, విజయపుర -15, ఉడిపి -14, దక్షిణా కన్నడ -12, దవంగెరే -9 వంటి ప్రాంతాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అందుకోసమే ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేసేందుకు కర్ణాటక సర్కారు సిద్ధమైంది. 

 


logo