శుక్రవారం 10 జూలై 2020
National - Jun 22, 2020 , 22:30:22

టూర్స్ అండ్ ట్రావెల్స్ కూ తగిలిన కరోనా సెగ

టూర్స్ అండ్ ట్రావెల్స్ కూ తగిలిన కరోనా సెగ

ఢిల్లీ : కరోనా ప్రభావం టూర్స్ అండ్ ట్రావెల్స్ పై తీవ్రంగా పడింది. ఈ రంగానికి అనుబంధ సంస్థలన్నీ కుదేలయ్యాయి. ముఖ్యంగా బస్సు, టూరిస్ట్ ట్యాక్సీ ఆపరేటర్లు బాగా దెబ్బతిన్నారని బస్ అండ్ కారు ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఓసిఐ) వెల్లడించింది. దాదాపు 20 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నది. 1 కోటి మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, ఇందులో మరో 30 లక్షల నుండి 40 లక్షలమంది పరిస్థితి ఆందోళనకరమేనని తెలిపింది. 15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్స్, 11 లక్షల టూరిస్ట్ ట్యాక్సీలు నిర్వహిస్తున్న 20,000 మంది ఆపరేటర్లకు బిఓసిఐ ప్రాతినిథ్యం వహిస్తున్నది. కోటి మంది వరకు నేరుగా ఉపాధి పొందుతున్న ఈ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలని బిఓసిఐ కోరుతున్నది. కరోనా పరిస్థితుల్లో చాలామంది తమ సేవల్ని క్లోజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి వారికి పన్నుల మాఫీ, రుణాలపై వడ్డీ మాఫీ ద్వారా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. లాక్ డౌన్ సమయంలో 95శాతం వానాలు రోడ్లపై తిరగలేదని, కేవలం కొన్ని బస్సులు మాత్రమే కంపెనీల కాంట్రాక్ట్ కారణంగా తిరిగాయని, మరికొన్ని వాహనాలను వలస కార్మికులను తరలించేందుకు ఉపయోగించినట్లు చెప్పింది.


logo