గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 16:18:14

3 - 4 కేసులున్న ప్రాంతాల‌ను దిగ్బంధించండి

3 - 4 కేసులున్న ప్రాంతాల‌ను దిగ్బంధించండి

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ రాష్ర్ట సీఎం యెడియూర‌ప్ప‌.. ఉన్న‌తాధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. బెంగ‌ళూరులో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. 3 నుంచి 4 పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్న ప్రాంతాల‌న్నింటిని గుర్తించి.. పూర్తిగా దిగ్బంధించాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ ఏరియాల్లో వీలైనన్ని టెస్టులు చేయాల‌ని సూచించారు. బెంగ‌ళూరులో లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.  

క‌ర్ణాట‌క రాష్ర్ట వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 9,150 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 137 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగ‌ళూరులో 1,272, క‌లాబురాగిలో 1,199, ఉడిపిలో 1,063, యాద్గీర్ లో 880, బీద‌ర్ లో 497 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo