సోమవారం 13 జూలై 2020
National - Jun 22, 2020 , 15:31:28

షష్టి పూర్తి మహోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

షష్టి పూర్తి మహోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

హైదరాబాద్: భారత హైందవ సంప్రదాయాలు ఎంతో విలువైనవి. మనం జరుపుకొనే ఎటువంటి శుభకార్యమైనా అర్థం, పరమార్థం ఇమిడి ఉంటాయి. మన పెద్దలు దూరదృష్టి తో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకుఅందించారు. అటువంటి వాటిల్లో " షష్టి పూర్తి మహోత్సవం " ఒకటి. అసలు షష్టి పూర్తి మహోత్సవం ఎందుకు కరుపుకోవాలి..? జరుపుకోవడం వల్ల ప్రయోజనము ఏమిటి? మనిషికి పూర్ణాయుర్దాయం 120 ఏండ్లు . ఇందులో సగభాగం 60. కాబట్టి అరవై ఏండ్లు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తైనట్లుగా  పరిగణిస్తారు. రిటైర్మెంట్ లైఫ్ అన్నమాట. ఆ తర్వాత  ఆధ్యాత్మిక పరంగా గడపాల్సి ఉంటుంది. యుక్త వయసులో ఉన్నంత శక్తి ఉండదు. అందుకోసమే కొన్ని తమ పిల్లలకు బాద్యతలను అప్పగించి ప్రశాంతమైన జీవనం సాగించాల్సి ఉంటుంది. షష్టి పూర్తి మహోత్సవం లో జ్యోతి శాస్త్ర రహస్యం ఉన్నది. "ఉగ్రరధ" అనే భయంకర దోషము అరవై నిండగానే మనిషి కి ఆవహిస్తుంది . దానివల్ల భయంకర శోకము ను మానవులు పొందుతారు. అందువల్ల షష్టి పూర్తి కార్యక్రమంలో భాగంగా ' ఉగ్రరధ ' దోషనివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 60 ఏండ్ల వయసు నిండిన తర్వాత ఆ భగవంతుణ్ణి ఆయురారోగ్యాలూ ప్రసాదించమని వేడుకొంటారు. షష్టి పూర్తి మహోత్సవాన్ని అమృతోత్సవం అని కుడా అంటారు. 


logo