మంగళవారం 07 జూలై 2020
National - Jun 21, 2020 , 23:06:00

గురివింద గింజల గురించి తెలియని నిజాలు

  గురివింద గింజల గురించి తెలియని నిజాలు

హైదరాబాద్: పూర్వ కాలంలో గురువింద గింజలను బంగారం తూకం వేయటానికి ఉపయోగించేవారు. ఈ గింజలను లక్ష్మి దేవి స్వరూపాలుగా భావిస్తారు. అంతేకాదు సాలగ్రామ పూజలో వీటిని గౌడియ వైష్ణవులు వినియోగించేవారట. ఇక తమిళ సిద్ధులు గురువింద గింజలను పాలల్లో మరగబెట్టిన తర్వాత అందులో ఉన్న విష లక్షణాలు కోల్పోయే విధంగా చేసి ఉపయోగించేవారు. గురువింద గింజ ఆకులను కొంత సేపు నోట్లో వేసుకొని నమిలిన తరువాత ఒకచిన్న రాయిని నోట్లో వేసుకొని నమిలితే ఆ రాయి నలిగి పిండి అవుతుందట. ఆయుర్వేదంలో ఈ గింజల్లోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతారు. ఆరావళి పర్వత ప్రాంతాల్లోనూ , భారతదేశంలోని కొన్ని అడవుల్లోను గురువింద గింజలు విరివిగా లభిస్తాయి. దీని శాస్త్రీయనామం 'ఏబ్రస్ ప్రికటోరియస్, కాగా ఫాబేసి కుటుంబానికి చెందింది.  


logo