శుక్రవారం 10 జూలై 2020
National - Jun 21, 2020 , 17:24:37

యోగా సందేశం ఇచ్చిన క్రీడాకారులు

యోగా సందేశం ఇచ్చిన క్రీడాకారులు

ఢిల్లీ : యోగా అనేది మన పూర్వీకులు మనకు అందించిన బహుమతి అని ప్రముఖ క్రీడాకారులు అన్నారు. 6వ యోగా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు ముహమ్మద్ అనాస్ యాహియా, జిమ్నాస్ట్ దీపా కర్మకర్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు యోగా సందేశం అందించారు. శరీరం లో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగా కీల‌క భూమిక పోషిస్తుంది. స‌నాత‌నకాలం నుంచి భారత సంప్రదాయంలోనే యోగా ఇమిడి ఉంది. ఒకానొక స‌మయంలో భార‌త్ లో యోగా అనునిత్యం విరాజిల్లింది. మ‌న పూర్వీకులు శారీర‌క స‌మ‌స్య‌లు దూరం చెయ్య‌డానికి, మాన‌సికంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండ‌టానికి యోగా చేసేవారని వారు పేర్కొన్నారు. 

"యోగా అనేది మన పూర్వీకుల నుంచి మనకు ఇచ్చిన బహుమతి. #InternationalYogaDay శరీరం, మనసుల సంపూర్ణ అభివృద్ధికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని, అందుకే అందరినీ యోగా వైపు ప్రోత్సహిస్తున్నాను " అంటూ క్రీడాకారుడు ముహమ్మద్ అనాస్ యాహియా యోగా చేస్తున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ప్రశాంతమైన మనస్సు. గొప్ప మనసు యోగాతోనే సాధ్యమని " జిమ్నాస్ట్ దీపా కర్మకర్ తన ట్విట్టర్ ఖాతాలో యోగాపోటోను షేర్ చేశారు. 


logo